40 ఏళ్ల తర్వాత మైనస్‌లోకి భారత జీడీపీ
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020-21 తొలి త్రైమాసికంలో మైనస్‌లోకి భారత జీడీపీ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ)
ఎందుకు : కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్ కారణంగా
గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్ దీనికి ప్రధాన కారణం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆగస్టు 31న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇదే తొలిసారి...
- 2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంది.
- గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి. చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి.
- త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి.
- తాజా త్రైమాసికంలో వ్యవసాయ రంగం మాత్రమే(3.4 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకుంది.
విలువల్లో చూస్తే...
- ఎస్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ -23.9 శాతం క్షీణ రేటు నమోదయి్యంది.
- కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8 శాతం క్షీణించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020-21 తొలి త్రైమాసికంలో మైనస్‌లోకి భారత జీడీపీ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ)
ఎందుకు : కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్ కారణంగా
Published date : 01 Sep 2020 04:33PM