Daily Current Affairs in Telugu: 04 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం(66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్‌పై ఆయన గెలుపొందారు.
2. భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు చైనా నూతన జాతీయ మ్యాప్‌ను తిరస్కరించాయి.
3. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి మొదటిసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది.
Daily Current Affairs in Telugu: 01 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
4. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు లభించింది.
5. ఆ్రస్టేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీకి భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మాత్రమే అవకాశం దక్కింది.
6. ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా హకుంపేట మండలంలోని అత్యంత ఎత్తైన సీతమ్మ కొండపై(1,680 మీటర్లు) ‘హర్ శిఖర్ తిరంగా’ కార్యక్రమం జరగనుంది.
Daily Current Affairs in Telugu: 31 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
7. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2022 ఏడాదికిగాను రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు లభించింది.
8. చంద్రయాన్–3 మిషన్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తన కార్యాచరణను పూర్తి చేసి స్లీప్ మోడ్‌లోకి వెళ్లిందని ఇస్రో తెలిపింది.
9. ప్రైవేటు రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ తన పదవికి రాజీనామా చేశారు.
10. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధికంగా 10 వరుస విజయాలు సాధించిన డ్రైవర్‌గా వెర్‌స్టాపెన్ గుర్తింపు పొందాడు.
Daily Current Affairs in Telugu: 28 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్