Skip to main content

35వ జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌ పోటీలు ఎక్కడ జరిగాయి?

35వ జాతీయ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆగస్టు 19న ముగిశాయి.

వారం రోజుల పాటు హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో సాగిన ఈ ఈవెంట్‌లో ఏవైఎన్‌కు చెందిన మోహిత్‌ సైనీ జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. లేజర్‌ స్టాండర్డ్‌ విభాగంలో సత్తా చాటిన సైనీకే ప్రతిష్టాత్మక ‘కెల్లీరావు ట్రోఫీ’తో పాటు ‘కటారి బౌల్‌’ కూడా దక్కింది. మహిళల విభాగంలో వీరవంశం వైష్ణవి ఓవరాల్‌ విజేతగా నిలవడంతో పాటు అత్యధిక విజయాల ‘మేజర్‌ ఏఏ బాసిత్‌ ట్రోఫీ’ని కూడా గెలుచుకుంది. భారత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

తుది ఫలితాలు: లేజర్‌ రేడియల్‌: 1.శిఖాన్షు సింగ్, 2. అవినాశ్‌ యాదవ్, 3. రామ్‌మిలన్‌ యాదవ్‌; లేజర్‌ స్టాండర్డ్‌: 1.మోహిత్‌ సైనీ, 2. ఇస్రాజ్‌ అలీ, 3. దిలీప్‌ కుమార్‌; మహిళల లేజర్‌ రేడియల్‌: 1. వీరవంశం వైష్ణవి, 2.ఆర్‌. అశ్విని, 3. సాన్యా పుంజ్‌కిరణ్‌; లేజర్‌ 4.7 బాలురు: 1.చున్ను కుమార్, 2.బి.కిరణ్‌ కుమార్, 3. సంజయ్‌ రెడ్డి; లేజర్‌ 4.7 బాలికలు: 1. రితిక డాంగి, 2. నేహ ఠాకూర్, 3. ఎల్‌. ఝాన్సీప్రియ

క్విక్రివ్యూ :
ఏమిటి : 35వ జాతీయ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : మోహిత్‌ సైనీ
ఎక్కడ : హుస్సేన్‌ సాగర్, హైదరాబాద్‌

Published date : 20 Aug 2021 06:44PM

Photo Stories