26 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ కేబినెట్ ఆమోదం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో 2020 ఏడాది ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 4న సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు
ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 4న సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు
- ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని నిర్ణయం.
- నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఆర్ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం. అలా మార్పు చేసే వరకు ఎన్‌పీఆర్ ప్రక్రియను అభయన్స్ లో ఉంచాలని నిర్ణయం.
- పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృది పనులను జీఎమ్మార్ ఎయిర్‌పోర్‌ట్స లిమిటెడ్ సంస్థకు అప్పగించేందుకు ఆమోదం.
- తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగింపు. ఆ మేరకు కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతికి నిర్ణయం.
- కాకినాడ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందానికి ఆమోదం.
- రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- ఏపీ జెన్‌కో, ఏపీపీడీసీఎల్ చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
Published date : 05 Mar 2020 06:05PM