2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఫార్మా దిగ్గజం?
Sakshi Education
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్-నల్లవెల్లిలో విస్తరించిన 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్‌స సంస్థ అక్టోబర్ 5న దత్తత తీసుకుంది.
ఇందులో భాగంగా రూ.5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా మంబాపూర్ అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. మంబాపూర్ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేయనున్నారు.
చదవండి: రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న బాహుబలి సినిమా హీరో
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఫార్మా దిగ్గజం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : హెటిరో డ్రగ్‌స సంస్థ
ఎక్కడ : మంబాపూర్-నల్లవెల్లి అటవీ ప్రాంతం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
Published date : 07 Oct 2020 05:35PM