Skip to main content

2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు

2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ వెల్లడించింది.
Current Affairsఈ మేరకు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ (ఈఎంఆర్) పేరిట రూపొందించిన నివేదికను నవంబర్ 25న విడుదల చేసింది. 5జీ సేవలు ప్రారంభమైన దగ్గర నుంచి 2025 నాటికి మొత్తం చందాదారుల్లో 11 శాతం 5జీ కనెక్షన్లను కలిగి ఉంటారని, 80 శాతం మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు ఎల్‌టీఈని కలిగి ఉంటాయని ఎరిక్సన్ తన నివేదికలో పేర్కొంది. ఒక్కో స్మార్ట్‌ఫోన్ సగటు నెలవారీ ట్రాఫిక్ 2025 నాటికి 24జీబీకి చేరనుందని విశ్లేషించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2022 నాటికి 5జీ సేవలు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ (ఈఎంఆర్)
ఎక్కడ : భారత్
Published date : 26 Nov 2019 05:47PM

Photo Stories