Skip to main content

2022 జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం

2022లో జరిగే ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి జూన్ 20న ప్రసంగించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, విదేశాలతో సంబంధాలు బలోపేతమయ్యాయని, ఈ నేపథ్యంలోనే 2022 జీ20 దేశాల సదస్సును భారత్‌లో నిర్వహిస్తున్నామని కోవింద్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలన్నీ సమర్థిస్తున్నాయన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2022 జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Published date : 21 Jun 2019 05:23PM

Photo Stories