Skip to main content

2021 ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలేటోర్ని ఏ దేశంలో జరగనుంది?

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత ఈవెంట్‌ అయిన ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే టోర్నమెంట్‌-2021 నుంచి భారత మహిళల 4x400 మీటర్ల బృందం వైదొలిగింది.
Current Affairs
పోలాండ్‌లోనిచోర్జో నగరంలో మే 1,2 తేదీలలో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నీలో రాణించిన రిలే జట్లకు టోక్యో ఒలింపిక్స్‌కు, 2022 ఏడాది జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించే అవకాశముంది. ‘‘వరల్డ్‌ రిలే టోర్నీకి సిద్ధమవుతున్న భారత మహిళల 4x400 రిలే బృందంలో ముగ్గురికి ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నాయి. అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నాం’’ అని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఏప్రిల్ 27న తెలిపింది. జూన్‌లో క్వాలిఫయింగ్‌ గడువు ముగిశాక టాప్‌–16లో ఉన్న రిలే జట్లు టోక్యో ఒలింపిక్స్‌-2021 బెర్త్‌లు దక్కించుకుంటాయి.

బ్యాంక్‌ చీఫ్‌ల పదవీ కాలం 15 ఏళ్లు...
దేశంలోని ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్‌ టైం డైరెక్టర్లపదవీకాలాన్ని 15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ 26న ఆదేశాలను జారీ చేసింది. చైర్మెన్, నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఎన్‌ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా ఆర్‌బీఐ నిర్ణయించింది. బోర్డ్‌ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్‌బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి :ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే టోర్నమెంట్‌-2021 నుంచివైదొలిగిన బృందం
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : భారత మహిళల 4x400 మీటర్ల బృందం
ఎక్కడ : చోర్జో, పోలాండ్‌
ఎందుకు :ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా...
Published date : 28 Apr 2021 06:38PM

Photo Stories