Skip to main content

2020లో భారత్ వృద్ధి 5.4 శాతమే: మూడీస్

భారత్ ఆర్థిక వృద్ధి 2020 అంచనాలకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ కోత పెట్టింది. దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటును 6.6 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది.
Current Affairsఈ మేరకు ఫిబ్రవరి 17న అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆర్థిక రికవరీ అంచనాలకన్నా నెమ్మదిగా ఉండటమే వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని మూడీస్ తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఇక 2021లో భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలకూ మూడీస్ కోత పెట్టింది. ఈ రేటును 6.7 శాతం నుంచి 6.6 శాతానికి కుదించింది.

ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
2019లో బ్రిటన్, ఫ్రాన్స్ లను అధిగమించి భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని యూఎస్‌కు చెందిన విశ్లేషణా సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ఒకటి తెలిపింది. భారత్ జీడీపీ విలువను 2.94 ట్రిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. బ్రిటన్ ఎకానమీ పరిమాణాన్ని 2.83 ట్రిలియన్ డాలర్లుగా, ఫ్రాన్స్ కు సంబంధించి ఈ విలువను 2.71 ట్రిలియన్ డాలర్లుగా పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020లో భారత్ వృద్ధి 5.4 శాతమే
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్
Published date : 18 Feb 2020 05:44PM

Photo Stories