Skip to main content

2020–21లో వృద్ధి 0.8 శాతమే: ఫిచ్

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్‌–2021 మార్చి) కేవలం 0.8 శాతమే నమోదవుతుందని (2019–20లో 4.9 శాతం) అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ అంచనావేసింది.
Current Affairs

కోవిడ్‌–19 ప్రభావాలు, అంతర్జాతీయంగా మాంద్యం వంటి అంశాలు దీనికి కారణంగా తన తాజా గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో పేర్కొంది. అయితే 2021–22లో వృద్ధిరేటు 6.7శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది. జనవరి–మార్చి మధ్య వృద్ధి రేటు 4.4 శాతం అయితే, ఏప్రిల్‌–జూన్‌లో –0.2 శాతం క్షీణత, జూలై–సెప్టెంబర్‌ మధ్య –0.1 శాతం క్షీణ రేటు నమోదవుతుందని పేర్కొంది.


ఆంక్షలు కొనసాగితే
– 0.9 శాతం: సీఐఐ
ఇదిలావుండగా, భారత పారిశ్రామిక వేదిక– కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) తాజాగా ఒక నివేదిక విడుదల చేస్తూ, లాక్‌డౌన్‌ సంబంధిత ఆంక్షలు మరింతకాలం పొడిగిస్తే, 2020–21లో భారత్‌ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదవుతుందని పేర్కొంది. అయితే పరిస్థితులు వేగంగా మెరుగుపడితే 1.5 శాతం వృద్ధి నమోదయ్యే వీలుందని అంచనావేసింది.

భారత్‌లో ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ కిడ్స్‌

ఫేస్‌బుక్‌ తాజాగా భారత్‌లో మరో కొత్త సర్వీస్‌ ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్‌ కిడ్స్‌ను ఏప్రిల్ 23న ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్‌ యాప్‌ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్‌ కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్‌ తెలిపింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020–21లో భారత్‌ వృద్ధి 0.8 శాతమే
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌
ఎందుకు : కోవిడ్‌–19 ప్రభావాలు, అంతర్జాతీయంగా మాంద్యం వంటి అంశాల కారణంగా
Published date : 24 Apr 2020 07:17PM

Photo Stories