Skip to main content

2020–21 ఏడాదిలో భారత్ జీడీపీ ఎంత శాతం క్షీణించింది?

కరోనాకల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.
Current Affairs
2020–21 ఆర్థిక సంవత్సరంలోస్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది.జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) మే 31న ఆర్థిక సంవత్సరం తాజా గణాంకాలను ఆవిష్కరించింది.

ఎన్‌ఎస్‌ఓ వెల్లడించిన గణాంకాల ప్రకారం...
  • కరోనా కట్టడికి దేశ వ్యాప్త కఠిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2020–21 తొలి జూన్‌ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతనునమోదుచేసుకుంది.
  • తదుపరి జూలై– సెప్టెంబర్‌ త్రైమాసికంలో క్షీణత7.4 శాతానికి పరిమితమైంది.
  • అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలోనూ భారత్‌ ఎకానమీ 0.5% వృద్ధిని నమోదుచేసుకుంది.
  • మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.6 శాతంగా నమోదైంది.

విలువలు ఇలా...
2011–21 ఆర్థిక సంవత్సరం స్థిర ధరల ప్రకారం (బేస్‌ ఇయర్‌ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన గణాంకాలు) 2019 ఏప్రిల్‌–2020 మార్చి మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.145.69 లక్షల కోట్లు. కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020 ఏప్రిల్‌–2021 మార్చి మధ్య రూ.135.13 లక్షల కోట్లకు ఎకానమీ విలువ పడిపోయింది. వెరసి 7.3 శాతం క్షీణతనమోదయ్యింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ4 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే.

కీలక రంగాల తీరు ఇలా...
  • వ్యవసాయం:2020-21 మొత్తం ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతం పురోగమించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15 శాతం.
  • మైనింగ్‌: మొత్తం ఆర్థిక సంవత్సరంలో క్షీణ రేటు 8.5 శాతం.
  • తయారీ: మొత్తం ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం క్షీణించింది.
  • నిర్మాణం: ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8.6 శాతం క్షీణించింది.
  • ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు:2020–21లో క్షీణ రేటు 18.2 శాతం.
  • ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవలు: మొత్తం ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతం క్షీణత.

Current Affairs


మరిన్ని అంశాలు..
  • 1979–80 ఆర్థిక సంవత్సరం తర్వాత అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్షీణ రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. అప్పట్లో క్షీణత5.2 శాతం.
  • 1950–51జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు – 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్‌ వృద్ధి నమోదైంది. వర్షాలు సరిగ్గా లేక వ్యవసాయ రంగం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు ఆరవసారిక్షీణతనమోదయ్యింది.
  • భారత్‌ ఎకానమీ మళ్లీ రూ.145 లక్షల కోట్ల స్థాయిని చేరుకోవాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ10 నుంచి 11 శాతం పురోగమించాలి.
  • 2020–21 తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదయ్యింది. దాదాపు 2018–19 నాటి రూ.1,25,883 స్థాయికి పడిపోయింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది.
ఎప్పుడు : మే31
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ)
ఎందుకు :కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం కారణంగా...
Published date : 02 Jun 2021 06:05PM

Photo Stories