Skip to main content

2014 నుంచి దేశంలో నిషేధానికి గురైన యాప్‌ల సంఖ్య?

దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజా నియంత్రణ రీత్యా 2014 నుంచి దేశంలో 296 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర కమ్యూనికేషన్, ఐటీశాఖ మంత్రి సంజయ్ ధోత్రి ఫిబ్రవరి 4న రాజ్యసభకు తెలిపారు.
Current Affairs
‘‘ఐటీ యాక్ట్ 2000, సెక్షన్ 69 ఏ’’ని అనుసరించి యాప్‌లపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ఈ యాప్‌ల ద్వారా వ్యక్తుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం, మొబైల్‌లోని సమాచారం మొత్తాన్ని దేశం వెలుపలకు రహస్యంగా తరలించడం జరుగుతోందని కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు.

మయన్మార్‌లో ఫేస్‌బుక్‌పై నిషేధం
మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై నిషేధం విధించింది. ఎన్నికై న ప్రజా ప్రభుత్వం, ప్రియతమ నేత అంగ్‌సాన్ సూకీని ప్రభుత్వం గద్దెదించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉండటం, దేశంలో అల్లర్లు తలెత్తుతాయన్న అనుమానాల నేపథ్యంలో సైనిక పాలకులు ఈ చర్య తీసుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2014 నుంచి నిషేధానికి గురైన యాప్‌ల సంఖ్య 296
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : కేంద్ర కమ్యూనికేషన్, ఐటీశాఖ మంత్రి సంజయ్ ధోత్రి
ఎక్కడ : దేశంలో
ఎందుకు : దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజా నియంత్రణ రీత్యా
Published date : 06 Feb 2021 05:47PM

Photo Stories