2 వేల కోట్లతో ఆయుధాల కొనుగోలు
Sakshi Education
సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింప చేసేందుకు రూ.2వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు రక్షణశాఖ సెప్టెంబర్ 13న ఆమోదం తెలిపింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో సమావేశమైన రక్షణ కొనుగోళ్ల కమిటీ (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టి-72, టి-90 ట్యాంకులకోసం దేశీయ మందుగుండు సామగ్రి అభివృద్ధికి, సరిహద్దుల్లో మందు పాతరలను అమర్చేందుకు డీఆర్‌డీవో రూపొందించిన ‘మెకానికల్ మైన్ లేయర్’ను కొనుగోలుకు అనుమతి లభించింది.
Published date : 14 Sep 2019 05:40PM