18 బిలియన్ డాలర్లకు భారత్-అమెరికా వాణిజ్యం
Sakshi Education
2019 సంవత్సరం ముగిసేనాటికి భారత్ -అమెరికా మధ్య రక్షణ రంగ వాణిజ్యం 18 బిలియన్ డాలర్ల (రూ. లక్షా ఇరవై ఏడువేల కోట్లు)కు చేరుకుంటుందని అమెరికాకి చెందిన పెంటగాన్ అంచనావేసింది.
ఇరుదేశాల మిలిటరీ టు మిలిటరీ సంబంధాలను బలపరిచేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. 2008లో ఇరు దేశాల మధ్య సున్నాగా ఉన్న వాణిజ్యం ఇప్పుడు 18 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గొప్పవిషయమని వ్యాఖ్యానించింది. 2018, ఆగస్టులో అమెరికా భారత్‌కు ట్రేడ్ అథారిటీ టైర్ 1 స్థాయిని ఇచ్చిందని, నాటో కూటమి దేశాలకు కాకుండా మరో దేశానికి ఈ గుర్తింపు ఇవ్వడం ఇదే ప్రథమమని పేర్కొంది.
త్వరలో భారత్ -అమెరికాల డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) తొమ్మిదో సమావేశం జరగనుంది.
త్వరలో భారత్ -అమెరికాల డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) తొమ్మిదో సమావేశం జరగనుంది.
Published date : 21 Oct 2019 05:20PM