17వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు
వివిధ కీలక రంగాల్లో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియాన్-ఇండియా కార్యాచరణ ప్రణాళిక 2021-2025ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు. కోవిడ్ ఆసియాన్ రెస్పాన్స్ ఫండ్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసియాన్ దేశాలతో భారత్ అనుసంధానం కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ కింద బిలియన్ డాలర్లు అందజేయనున్నట్లు తెలిపారు.
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఆసియాన్‌తో తమ బంధం నానాటికీ బలపడుతోందని మోదీ చెపోపారు. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్-ఆసియాన్ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.
ఆసియాన్ సభ్యదేశాలు...
ఆగ్నేయాసియాలోని పది దేశాల కూటమే ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్). 1967 ఆగస్టు 8న ఆసియాన్‌ను ఏర్పాటు చేశారు. ఇండోనేసియాలోని జకార్తాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఆసియాన్‌లో పది సభ్యదేశాలు ఉన్నాయి.
అవి..
- ఇండోనేసియా
- థాయిలాండ్
- సింగపూర్
- ఫిలిప్పైన్స్
- మలేసియా
- వియత్నాం
- బ్రూనై
- కాంబోడియా
- మయన్మార్
- లావోస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 17వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆన్‌లైన్‌లో
ఎందుకు : వివిధ కీలక రంగాల్లో భారత్-ఆసియాన్ దేశాల మధ్య సహకారం కోసం