16 ఏళ్లకే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన బాలిక
Sakshi Education
స్టాక్‌హోమ్: నోబెల్ శాంతి బహుమతి కోసం ఎవరెవరి పేర్లో చర్చకు వస్తుంటే... అనూహ్యంగా స్వీడన్ దేశానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించింది.
ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నవారిలో మలాల(17 ఏళ్లకే) అత్యంత పిన్నవయస్కురాలు. కానీ అంతకంటే ఏడాది తక్కువ వయసున్న గ్రెటా థంబెర్గ్.. పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికిగాను నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. ఒకవేళ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రెటాకే దక్కితే.. మలాల రికార్డును అధిగమిస్తుంది.
ఆలోచింపజేసే ప్రసంగాలు..: పర్యావరణ మార్పులపై తన ప్రసంగాలతో యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించి పర్యావరణ ఉద్యమకారిణిగా గ్రెటా థంబెర్గ్ గుర్తింపు పొందింది. ‘మీ ఆకాంక్షలు నాకు అక్కర్లేదు. మీ ఆశయాలూ నాకు అక్కర్లేదు. నాకు కావాలసిందల్లా మీరు ఆందోళన చెందడమే. అదీ ఎంతగా అంటే.. మీ ఇల్లు మంటల్లో చిక్కుకున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో.. అంతగా పర్యావరణం గురించి కూడా మీరు కంగారు పడాలంటూ ఆలోచింపజేసేలా చేసే ప్రసంగం ఎన్నో చోట్ల పర్యావరణ ఉద్యమాలకు ఊపిరి పోసింది.
మోదీజీ మాటలు కాదు.. చేతల్లో చూపండి..
పర్యావరణ మార్పులపై చర్య తీసుకోవాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి గ్రెటా గత నెలలో ఓ వీడియో సందేశాన్ని కూడా పంపింది. ఆ సందేశంలో.. ‘మోదీ జీ పర్యావరణ మార్పులపై ప్రసంగాలకే పరిమితం కాకుండా కార్యాచరణ మొదలుపెట్టాలంటూ సూచించింది.
టైమ్స్‌లో చోటు..: ‘టైమ్స్ అత్యంత ప్రభావిత చిన్నారుల జాబితా-2018’లో కూడా గ్రెటాకు చోటుదక్కింది. పర్యావరణ మార్పులపై నాయకులు స్పందించాలంటూ 2018 ఆగస్టులో స్వీడిష్ పార్లమెంటు ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కూడా చేపట్టింది. పర్యావరణ మార్పులపై నాయకులు చర్యలు తీసుకునేలా విద్యార్థులంతా పోరాడాలని పిలుపునిచ్చింది. అలాగే గత డిసెంబరులో ఐరాసలో వాతావరణ మార్పులపై అద్భుతమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. జనవరిలో దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక వేదికపైనా తన గళాన్ని వినిపించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 16 ఏళ్లకే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన స్వీడన్ బాలిక
ఎవరు: గ్రెటా థంబెర్గ్
ఎక్కడ : స్టాక్‌హోమ్ (స్వీడన్)
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికిగాను

Published date : 16 Mar 2019 06:23PM