1,300 సైనిక వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?
Sakshi Education
సైన్యానికి అవసరమైన 1,300 లైట్ కాంబాట్ వెహికల్స్ కొనుగోలుకు మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్(ఎండీఎస్ఎల్)తో భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది.
ఈ విషయాన్ని రక్షణ శాఖ మార్చి 22న వెల్లడించింది. రూ.1,056 కోట్లతో ఈ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. మహీంద్రా సంస్థ వచ్చే నాలుగేళ్లలో ఈ వాహనాలను రక్షణ శాఖకు అప్పగించేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ లైట్ కాంబాట్ వాహనాలను మెషిన్ గన్లు, అటోమాటిక్ గ్రెనేడ్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. లైట్ కాంబాట్ వెహికల్స్‌ను ఎండీఎస్‌ఎల్ దేశీయంగానే డిజైన్ చేసి, అభివృద్ధి చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్(ఎండీఎస్ఎల్)తో ఒప్పందం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎందుకు : సైన్యానికి అవసరమైన 1,300 లైట్ కాంబాట్ వెహికల్స్ కొనుగోలు కోసం

Published date : 23 Mar 2021 06:15PM