127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సభలో ప్రవేశపెట్టారు. సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించేందుకు వీలుగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతు(ఎస్‌ఈబీసీ)ల జాబితాలను రాష్ట్రాలు సొంతంగా రూపొందించుకునేందుకుగాను ఆర్టికల్ 342ఏ, తదనుగుణంగా ఆర్టికల్ 338బీ, 366లకు రాజ్యంగ సవరణలు చేయాల్సి ఉందని మంత్రి వీరేంద్ర చెప్పారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ) రూపకల్పన, విధులు; ఒక కులాన్ని ఎస్‌ఈబీసీగా ప్రకటించేందుకు రాష్ట్రపతికి ఉన్న అధికారం, జాబితాను మార్చేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారాలను ఈ అధికరణలు నిర్వచిస్తున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 127వ రాజ్యాంగ సవరణ బిల్లు–2021కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ఇతర వెనకబడిన తరగతుల(ఓబీసీ) జాబితాను సొంతంగా సిద్ధంచేసే అధికారాలను రాష్ట్రాలకు మళ్లీ కట్టబెట్టేందుకు...