Skip to main content

100 కోట్ల కరోనా టీకా డోసులు అందిస్తాం: జీ7 దేశాలు

కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం,సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో జూన్ 11న ప్రారంభమయ్యింది.
Current Affairs
కార్బిస్‌బే రిసార్టులో ఏర్పాటు వేదిక నుంచి యూకే ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రపంచ దేశాధినేతలకు అభివాదం చేసి, సదస్సుకు శ్రీకారం చుట్టారు.ప్రపంచంపై కోవిడ్‌–19 వైరస్‌ దాడి మొదలయ్యాక ఇదే మొదటి జీ7 సదస్సు. యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌ పాల్గొంటున్నాయి.మళ్లీ మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం (బిల్డింగ్‌ బ్యాక్‌ బెట్టర్‌ ఫ్రమ్‌ కోవిడ్‌–19) అన్న నినాదంతో జరుగుతున్న జీ7 సదస్సులో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా అతిథి దేశాలుగా భాగస్వాములవుతున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు.

ప్రపంచానికి 100 కోట్ల కరోనా టీకాలు...
జీ7 సదస్సులో ప్రధానంగా కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌ పైనే చర్చించారు. కనీసం 100 కోట్ల కరోనా టీకా డోసులను ప్రపంచ దేశాలకు అందజేయాలని, మహమ్మారి వల్ల నష్టపోయిన దేశాలకు చేయూతనందించాలని జీ7 దేశాలు తీర్మానం చేశాయి. 100 కోట్ల టీకాలలో బ్రిటన్ 10 కోట్లు, అమెరికా 50 కోట్ల టీకాలను అందించనున్నాయి.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 100 కోట్ల కరోనా టీకా డోసులను ప్రపంచ దేశాలకు అందిస్తామని తీర్మానం
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7) దేశాలు
ఎక్కడ : కార్బిస్‌బే రిసార్టు,యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)
ఎందుకు:కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం,సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా...
Published date : 12 Jun 2021 06:49PM

Photo Stories