BR Ambedkar: రేపే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ... పూర్తి వివరాలు ఇవిగో
పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్‌సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
చదవండి: తండ్రి ఉద్యోగం రాకపోవడంతో... పేపర్లను లీక్ చేసిన ప్రవీణ్
రూ.147 కోట్లతో నిర్మాణం
అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.146.50కోట్ల నిధులు కేటాయించింది. హుస్సేన్‌సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. స్తూపాన్ని నిర్మించిన తరువాత విగ్రహ భాగాలను ఢిల్లీలో సిద్ధంచేసి హైదరాబాద్‌కు తరలించారు.
చదవండి: భారీగా గురుకుల పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం ఇదే!
విగ్రహావిష్కరణ కోసం రూ.10 కోట్లు విడుదల
విగ్రహం కింద, పీఠం లోపల స్మారక భవనంలో మ్యూజియం, అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటుకానుంది. భవనం లోపల ఆడియో విజువల్ రూమ్స్ ఉన్నాయి. స్మారకం వెలుపల పచ్చదనం కోసం 2.93 ఎకరాల ఖాళీ స్థలం ఉంటుంది. స్మృతివనంలో రాక్‌గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్, శాండ్ స్టోన్ ఉన్నాయి. విగ్రహావిష్కరణ కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం కేసీఆర్ తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు.