ASEAN-India Summit: భారత్ – ఆసియాన్ ఫ్రెండ్‌షిప్ ఇయర్‌ను ఎప్పడు పాటించనున్నారు?
18వ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) – భారత్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి అక్టోబర్ 28న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇండోఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని, ఆసియాన్ దేశాల విధానాలకు కట్టుబడే ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. భారత్– ఆసియాన్ భాగస్వామ్యానికి వచ్చే ఏడాది 30 ఏళ్లు నిండుతాయని, అలాగే స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తవుతాయన్నారు. ఈ ముఖ్యమైన సందర్భాలను పురస్కరించుకొని 2022ను ‘భారత్– ఆసియాన్ ఫ్రెండ్‌షిప్ ఇయర్’గా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటామని అన్నారు. 2021 ఆసియాన్ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న బ్రూనై దేశ సుల్తాన్ హసనల్ బోల్కియాకు మోదీ అభినందనలు తెలిపారు. కరోనా కారణంగా వరుసగా రెండో ఏడాది సదస్సును వర్చువల్‌గా నిర్వహించారు.
ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) 1967లో ఆగస్ట్ 8న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జకార్తాలో ఉంది. ఆగ్నేయాసియాలోని పది దేశాలు ఈ కూటమిలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అవి.. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి.
చదవండి: సరిహద్దు భూ చట్టానికి ఆమోదం తెలిపిన దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్