New Land Border Law: సరిహద్దు భూ చట్టానికి ఆమోదం తెలిపిన దేశం?
సరిహద్దు ప్రాంతాల్ని మరింతగా ఆక్రమించుకోవడానికి వీలుగా కొత్త సరిహద్దు భూ చట్టానికి డ్రాగన్ దేశం చైనా ఆమోదముద్ర వేసింది. చైనా ప్రజల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవని, ఎవరూ దానిని ఉల్లంఘించడానికి వీల్లేదని ఆ చట్టంలో పేర్కొంది. 2022, జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కి చెందిన స్టాండింగ్ కమిటీ అక్టోబర్ 23న ఆమోదించినట్టుగా జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే చైనా ఎంతటి చర్యలకైనా దిగుతుందని చట్టంలో ఉంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సరిహద్దు ప్రాంతాల రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది.
14 దేశాలతో...
మొత్తం 14 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటున్న చైనాకి ప్రస్తుతం భారత్, భూటాన్‌లతోనే సమస్యలున్నాయి. మిగిలిన 12 దేశాలతో సరిహద్దు సమస్యల్ని ఆ దేశం పరిష్కరించుకుంది. భారత్‌తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో తాజా చట్టాన్ని తెచ్చింది.
చదవండి: ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికైన దక్షిణాసియా దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్త సరిహద్దు భూ చట్టానికి ఆమోదం తెలిపిన దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : చైనా
ఎందుకు : భారత్‌తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్