Skip to main content

UNHRC: ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికైన దక్షిణాసియా దేశం?

UNHRC

దక్షిణాసియా దేశం భారత్‌ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఎన్నికైంది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీలోని 18 కొత్త సభ్యుల కోసం అక్టోబర్‌ 14న నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. ఐరాస సర్వప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో 2022 జనవరి నుంచి 2024, డిసెంబర్‌ వరకు మూడేళ్ల పాటు... యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో భారత్‌ సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి భారత్‌ ఎన్నిక కావడం ఇది ఆరోసారి. భారత్‌తో పాటు కజకిస్తాన్, మలేసియా, ఖతర్, యూఏఈ సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి.

యూఎన్‌హెచ్‌ఆర్‌సీ...

అంతర్జాతీయంగా మానవహక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడానికి ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌ను 1946 డిసెంబర్‌ 10న ఏర్పాటుచేశారు. సాంఘిక, ఆర్థిక మండలిలో అంతర్భాగమైన ఈ కమిషన్‌లో 53 సభ్యదేశాలకు మూడేళ్ల పదవీకాలానికి సభ్యత్వముండేది. కమిషన్‌ పనితీరు అనేక విమర్శలకు గురవడంతో దాని స్థానంలో 2006 మార్చి 15న మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో ఉంది. మూడు సంత్సరాలకొకసారి యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపునిస్తుంది.

 

నిర్మాణం..

యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో 47 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఐరాస  సర్వప్రతినిధి సభ వీరిని ఎన్నుకుంటుంది. సభ్యదేశాల పదవీకాలం మూడేళ్లు. వరుసగా రెండు పర్యాయాలకు మించి ఎన్నికయ్యేందుకు వీలుండదు. సభ్యదేశాల కేటాయింపు ప్రాంతాల వారీగా ఉంటుంది.

  • ఆఫ్రికా – 13
  • ఆసియా – 13
  • తూర్పు యూరప్‌ – 6
  • లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ – 8
  • పశ్చిమ యూరప్, ఇతర గ్రూపులు – 7

చ‌ద‌వండి: మలబార్‌ రెండో దశ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఎన్నికైన దక్షిణాసియా దేశం?
ఎప్పుడు  : అక్టోబర్‌ 14
ఎవరు    : భారత్‌
ఎందుకు : యూఎన్‌హెచ్‌ఆర్‌సీలోని 18 కొత్త సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించడంతో..

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్

Published date : 16 Oct 2021 06:15PM

Photo Stories