Defence Deal: బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేయనున్న దేశం?
భారత్ తయారీ బ్రహ్మోస్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 37.4 కోట్ల డాలర్ల (రూ.2800 కోట్లకు పైనే) విలువైన ఒప్పందం కుదిరింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (బీఏపీఎల్) ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసినట్టుగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 28న ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఆయు«ధాలను, క్షిపణి వ్యవస్థల్ని ఎప్పుడూ దిగుమతి చేసుకునే భారత్ ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు వేసినట్లయింది.
ముఖ్యాంశాలు..
- విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఛేదించగలవు. ఫిలిప్పీన్స్ నేవీకి యాంటీ–షిప్ బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందని భారత రక్షణ శాఖ తెలిపింది.
- భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ)తో కలిసి బీఏపీఎల్ బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఇండో–రష్యన్ జాయింట్ వెంచర్‌లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే.
- ఫిలిప్పీన్స్ నావికాదళం ఎన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయనుందో రక్షణ శాఖ వెల్లడించలేదు. ఈ కొనుగోలు ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్ పలు చర్యలు తీసుకుంటోంది.
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్, అస్త్ర, రాడార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం కూడా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని డీఆర్‌డీఒ చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు.
చదవండి: మధ్య ఆసియా దేశాలతో ఉమ్మడి సదస్సును నిర్వహించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు భారత్‌తో ఒప్పందం చేసుకున్న దేశం?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఫిలిప్పీన్స్
ఎందుకు : సైనిక విభాగాల ఆధునీకరణ చర్యల్లో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్