Skip to main content

Submarine: సరిహద్దు నుంచి ఎన్ని మైళ్ల మేరకు ప్రాదేశిక జలాలు ఉంటాయి?

Sea

భారత జలాంతర్గామి అరేబియా సముద్రంలో తమ ప్రాదేశిక జలాల్లోకి రాకుండా అడ్డుకున్నామని పాకిస్తాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్‌ 16న భారత జలాంతర్గామి తమ జలాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా పాక్‌ వైమానిక దళానికి చెందిన గస్తీ విమానం దీన్ని పసిగట్టి ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసిందని అక్టోబర్‌ 19న తెలిపింది.

ప్రాదేశిక జలాలు: దేశం సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల మేరకు ప్రాదేశిక జలాలు ఉంటాయి. దీన్ని ఆ దేశం అధీనంలోని సముద్రభాగంగా గుర్తిస్తారు.

బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా అక్టోబర్‌ 19న సముద్రజలాల్లో బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. సిన్‌పో నౌకాశ్రయం సమీపంలోని సముద్ర జలాల్లో జలాంతర్గామి నుంచి తక్కువ శ్రేణి క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది.

ఉత్తర కొరియా రాజధాని: ప్యాంగ్యాంగ్‌; కరెన్సీ: నార్త్‌ కొరియన్‌ వన్‌
ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు: కిమ్‌ జోంగ్‌–ఉన్‌

చ‌ద‌వండి: ఏ దేశంతో భారత్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకోనుంది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Oct 2021 02:50PM

Photo Stories