Skip to main content

India-Australia: రక్షణ బంధం బలోపేతం.. ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్‌

భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆ్రస్టేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ప్రకటించారు.
India-Australia

‘ఎక్సర్‌సైజ్‌ మలబార్‌’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్‌ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను మార్చి 9వ తేదీ ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్‌ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆ్రస్టేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆ్రస్టేలియాలో ఎక్సర్‌సైజ్‌ మలబార్‌ నిర్వహించనున్నాం. వాటిలో భారత్‌ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ ( 05- 11 ఫిబ్రవరి 2023 )

మోదీపై ప్రశంసల జల్లు 
ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్‌ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టి. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్‌ రావత్‌ డిఫెన్స్‌ ఆఫీసర్స్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. 
రక్షణ మంత్రుల చర్చలు 
రక్షణ రంగంలో ఆ్రస్టేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్‌ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.

Bill Gates: ప్రగతి పథంలో భారత్‌.. బిల్‌గేట్స్

Published date : 11 Mar 2023 03:35PM

Photo Stories