Swachh Sarvekshan Awards 2022 - టాప్–10లో 3 ఏపీ నగరాలు
జాతీయ స్థా యిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొ రేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా షెహర్’ అవార్డు దక్కింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్ దీప్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మున్సి పల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మిలు ఈ అవార్డులను అందుకున్నారు.
స్వచ్ఛ సర్వే క్షణ్– 2022లో ఏపీ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలవగా, లక్ష కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో జీవీఎంసీ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లు టాప్–10 కేటగిరీలో స్థానం సంపాదించాయి. కర్నూలు, నెల్లూరు, కడప, రాజమహేంద్రవరం యూఎల్బీలు (అర్బన్ లోకల్ బాడీస్) కూడా టాప్–100 కేటగిరీలో నిలిచాయి.
సౌత్ జోన్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో టాప్–100 యూఎల్బీల్లో 21 నగరాలు నిలిచాయి. ఇందులో పుంగనూరు మున్సిపాలిటీ 3వ ర్యాంకు, పులివెందుల 9వ ర్యాంకు సాధించాయి.
25 – 50 వేల జనాభా విభాగంలో 8 యూఎల్బీలు టాప్ 100 ర్యాంకింగ్‌లో నిలిచాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛ రాష్ట్ర రాజధాని నగరం’గా నిలవగా,
10–40 లక్షల జనాభా కేటగిరీలో విశాఖ ‘క్లీన్ బిగ్ సిటీ’గా అవార్డు పొందింది.
సౌత్ జోన్‌లోని 50 వేలు– లక్ష జనాభా కేటగిరీలో ‘ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసె స్ విభాగంలో పులివెందుల, 25 – 50 వేల జనాభా కేటగిరిలో సాలూరు అవార్డు సాధించగా, ప్రజాభిప్రాయం విభాగంలో పుంగనూరును మున్సిపాలిటీ అవార్డులను సొంతం చేసుకున్నాయి.
ఇండియన్ స్వచ్ఛతాలీగ్ విభాగంలో మిలియ న్ ప్లస్ కేటగిరీలో విశాఖ ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ అవార్డు సొంతం చేసుకోగా, ప్రత్యేక కేటగిరీలో శ్రీకాకుళం కార్పొరేషన్, పొదిలి యూఎల్బీలు అవార్డులను అందుకున్నాయి.
చెత్త రహిత నగరాల్లో తిరుపతి, విశాఖ, విజయవాడ కార్పొరేషన్లు ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ సాధించాయి.