Skip to main content

Oscar Awards : ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌.. 15 విభాగాల్లో ఈ సినిమాను..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇద్దరు స్వాతంత్య్ర‌ సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో రాజమౌళి రూపొందించి ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

హాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం ఈ మూవీని..

RRR

ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్‌ బరిలో నిలవాలని కోరుకు​న్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది. దీంతో అంతా షాకయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్‌ నామినేట్‌కు పంపకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమయ్యింది.

ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం..

Telugu Movie RRR

దీంతో అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్‌ను డిస్ట్రిబ్యూట్‌ చేసిన వేరియల్స్‌ ఫిలిం సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్‌ నామినేషన్స్‌కు పరిశీలించాలని ఆకాడమిని కోరింది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ లాస్‌ ఎంజెల్స్‌లో వారం రోజుల పాటు ప్రదర్శించబడిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం.. ఏ సినిమా అయినా ‘లాస్ ఏంజెల్స్’లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో వారం పాటు ప్రదర్శించబడితే ఆస్కార్ అవార్డు బరిలో నిలవచ్చు. ఈ క్రమంలో ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’(For Your Consideration) కింద 15 విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్‌’ను చిత్ర బృందం క్యాంపెయిన్‌ చేస్తున్నారు.

ఈ విషయాన్ని రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ 15 విభాగాల్లో ఆస్కార్‌ బరిలో క్యాంపెయినింగ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. 

బెస్ట్ మోషన్ పిక్చర్: డివివి దానయ్య, బెస్ట్ డైరెక్టర్ : ఎస్ఎస్ రాజమౌళి, బెస్ట్ యాక్టర్ : జూ. ఎన్టీఆర్ , రాంచరణ్ .. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగన్ , బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు , బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : కీరవాణి, బెస్ట్ ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ , బెస్ట్ సౌండ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ బరిలో క్యాంపెయిన్‌ చేస్తోంది.

Published date : 06 Oct 2022 02:13PM

Photo Stories