Sahitya Akademi Award: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు
Sakshi Education

2022 ఏడాదికి సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 23 భాషల్లో పలువురు రచయితలు, కవులకు అవార్డులు ప్రకటించారు. ఇద్దరు తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. మధురాంతకం నరేంద్ర రాసిన మనోధర్మపరాగం నవలకు అవార్డు లభించింది. అలాగే సుప్రసిద్ధ కవి, రచయిత గుల్బార్ రాసిన ఆకుపచ్చ కవితను తెలుగులోకి అనువాదం చేసిన వారాల ఆనంద్‌కి సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 2023 మార్చి 11వ కేంద్రం అవార్డులను అందజేయనుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 30 Dec 2022 05:13PM