ఏఎస్‌ఆర్‌బీ–నెట్, ఏఆర్‌ఎస్, ఎస్‌టీఓ–2021.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 25..
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)..
రాష్ట్రానికి సంబంధించిన లేదా ఇతర అగ్రికల్చరల్‌యూనివర్శిటీల్లో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
అర్హత: 19.09.2021 నాటికి సంబంధిత విభాగాలు, స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2021 నాటికి 21ఏళ్లు నిండి ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)కి గరిష్ట వయసు లేదు.ప్రయత్నాల సంఖ్య కూడా అపరిమితం(ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు).
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: దీనిలో ఒక పేపర్ ఉంటుంది. దీన్ని 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు. దీనిలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్–ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఏఆర్‌ఎస్)..
ఏఆర్‌ఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్, వైవా వాయిస్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను ఐకార్‌లో సైంటిస్ట్‌లుగా తీసుకుంటారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 222
అర్హత: సంబంధిత విభాగంలోని స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2021 నాటికి 21–32ఏళ్ల మధ్య ఉండాలి. ప్రయత్నాల సంఖ్య 6 (అన్‌రిజర్వ్‌డ్ కేటగిరి), ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 9.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా(ప్రిలిమ్స్),మెయిన్, వైవా–వాయిస్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఏఆర్‌ఎస్–2021(ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. దీన్ని 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు. దీనిలో అర్హత సాధించిన వారిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇది 240 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 3గంటలు. దీనిలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను వైవా వాయిస్‌కి ఎంపిక చేస్తారు.
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్‌టీఓ)..
దీనిద్వారా ఐకార్ హెడ్ క్వార్టర్స్, ఇతర పరిశోధనా సంస్థల్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీచేస్తారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 65
అర్హత: 19.09.2021 నాటికి సంబంధిత స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25.04.2021 నాటికి 21–35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
పరీక్షా విధానం: ఈ పరీక్షను 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు. ఈ పరీక్షలో కనీసం అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వూకి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.04.2021
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 25.04.2021
నెట్–2021/ఏఆర్‌ఎస్(ప్రిలిమినరీ)–2021/ఎసీటీఓ పరీక్ష తేదీలు: 2021 జూన్ 21 నుంచి 27 వరకు
ఏఆర్‌ఎస్–2021(మెయిన్స్) పరీక్ష తేది: 19.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in