Skip to main content

అగ్రికల్చర్ అగ్రీ కోర్సుల్లో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ప్రవేశాలు: ఎన్జీ రంగా వర్సిటీ

గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో ప్రవేశాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్కృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌టెక్నాలజీ, బీఎస్సీ సామాజిక విజ్ఞానం కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటాలో ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ. ఏసీ.ఇన్‌’ను చూడాలని సూచించారు.
Published date : 27 Aug 2021 05:34PM

Photo Stories