Skip to main content

Vedic University: వేదిక్‌ వర్సిటీలో ఘనంగా మాతృభూమికి వందనం

Flag hoisting ceremony at Tirupati City, Vedic University, Sri Venkateswara Vedic University 'Salute to Motherland' Program,
Vedic University

తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శుక్రవారం మాతృభూమికి వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వీసీ ఆచార్య రాణీ సదాశివమూర్తి పాల్గొని, త్రివర్ణ రంగులతో రూపొందించిన కలశాల్లో మట్టి, బియ్యం సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కీర్తిని కొనియాడారు. భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని, భారతీయతను, భరతజాతి గౌరవాన్ని, భారతదేశ గొప్పతనాన్ని నలుదిశలా వ్యాప్తి చేయాల్సి బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధేశ్యామ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు నీలకంఠం, భారత్‌ శేఖరచార్యులు, గణేష్‌ ప్రసాద్‌ భట్‌, ఫణి, యజ్ఞేశ్వర యాజులు పాల్గొన్నారు.

Published date : 16 Oct 2023 09:32AM

Photo Stories