Scholarships: విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
మహారాణిపేట: తపాలాబిళ్లలు సేకరించే విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులని పేర్కొన్నారు. పాఠశాలలో ఫిలాటెలీ క్లబ్ ఏర్పాటై, ఆ విద్యార్థి అందులో సభ్యుడై ఉండాలని, పాఠశాలలో క్లబ్ లేకపోతే విద్యార్థి వ్యక్తిగత ఫిలాటెలీ డిపాజిట్ అకౌంట్ కలిగి ఉండాలని సూచించారు.
స్కాలర్‌షిప్‌నకు ఎంపికై న వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6వేలు ఒక సంవత్సరం ఇస్తారని పేర్కొన్నారు. దరఖాస్తుల కోసం సమీపంలోని పోస్టాఫీసుల్లో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 20వ తేదీలోగా ఫిలాటెలీ స్టాంప్ జత చేసి స్పీడ్‌పోస్ట్ ద్వారా పోస్ట్‌మాస్టర్ జనరల్, విశాఖ రీజియన్, ఎంపీవీ కాలనీ చిరునామాకు పంపించాలని వివరించారు.