IIT Kanpur Admission : కానిస్టేబుల్ కుమార్తె అనుపమకు కాన్పూర్ ఐఐటీలో సీటు.. సత్కరించిన ఎస్పీ మల్లికా గర్గ్..
Sakshi Education
గుంటూరు జిల్లాలోని.. మార్టూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పూర్ణాంజనేయరాజు చిన్న కుమార్తె అనుపమ ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ సీటు సాధించింది.
ఈ సందర్భంగా కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ జూలై 27వ తేదీన (గురువారం) తమ కార్యాలయానికి పిలిపించుకొని అనుపమను శాలువాతో సత్కరించి రూ.10 వేలు నగదు పురస్కారం బహుమతిగా అందించారు.
☛ 51 Year Old Woman Passed 10th Class Exams : 51 ఏళ్ల వయస్సులో.. 10వ తరగతి పాస్.. ఎందుకంటే..?
ప్రస్తుతం కాన్పూర్ ఐఐటీ కళాశాలలో మూడో ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్న కానిస్టేబుల్ పూర్ణాంజనేయరాజు పెద్ద కుమార్తె జాహ్నవి గతంలో ర్యాంకు సాధించిన సందర్భంగా ఎస్పీ మల్లికా గర్గ్ రూ.25 వేలు నగదు పురస్కారం అందించి అభినందించినట్లు కానిస్టేబుల్ గుర్తు చేసుకున్నారు.
Published date : 28 Jul 2023 06:49PM