Skip to main content

University: వర్సిటీ అభివృద్ధికి సమష్టి కృషి

development of the University
development of the University

రాజానగరం: తెలుగు రాష్ట్రాలలో పెద్ద యూనివర్సిటీగా ఉన్న ఆదికవి నన్నయ యూనివర్సిటీని ప్రగతి పథంలో నడిపించడానికి సమష్టి కృషి అవసరమని వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. నూతనంగా ఏర్పడిన పాలకమండలి సభ్యులు వీసీ అధ్యక్షతన సోమవారం తొలి సమావేశాన్ని నిర్వహించారు. యూనివర్సిటీలో విద్య, పరిపాలన తదితర అంశాలు, కొత్తగా మంజూరైన అధ్యాపక పోస్టుల భర్తీలో రేషనలైజేషన్‌ల పై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రరెడ్డి ఆన్‌లైన్‌లో సమావేశంలో పాల్గొని, నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఆయా రంగాలకు చెందిన సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, పాలక మండలి సభ్యులు ఆచార్య పి.సురేష్‌వర్మ, డాక్టర్‌ పి.విజయనిర్మల, డాక్టర్‌ కె.జ్యోతి, డాక్టర్‌ కె.నూకరత్నం, వసంతలక్ష్మి, షేక్‌ సులేమాన్‌, గంధం నారాయణరావు, రాజ్‌కుమార్‌, వై.సత్యనారాయణ పాల్గొన్నారు.

Published date : 05 Sep 2023 03:10PM

Photo Stories