Shri Kurella Vittalacharya: ఇంటినే గ్రంథాలయం చేసిన విఠలాచార్య
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఆయన.. తన ఇంటిని రెండు లక్షల పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చారు. తన పెన్షన్ డబ్బుతోనే ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. అనేక రచనలు చేసి అభినవ పోతన, మధురకవిగా పేరొందారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాశరథి పురస్కారం, 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం పొందారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు కూడా అందుకున్నారు.
పల్లెకు పట్టం కట్టారు: ‘‘కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం ద్వారా పల్లెకు పట్టం కట్టినట్లు భావిస్తున్నాను. పల్లెను నమ్ముకొని జీవిస్తూ సాహిత్య, సాంస్కృతిక ధార్మిక సేవలు అందిస్తున్న నాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడం సంతోషకరంగా ఉంది. నా సేవలను, సాహితీ వ్యాసంగాన్ని ప్రధాని స్వయంగా ప్రశంసించడం మర్చిపోలేను.
– డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య