450 ఎంబీబీఎస్, 70 పీజీ మెడికల్ సీట్ల రద్దు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో 2021–22 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎన్‌ఆర్ (సంగారెడ్డి), టీఆర్‌ఆర్ (పటాన్‌చెరు), మహవీర్ (వికారాబాద్) మెడికల్ కాలేజీల్లోని 450 ఎంబీబీఎస్, 70 పీజీ మెడికల్ సీట్లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) రద్దు చేసింది.
కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, అధ్యాపకుల్ని అవసరం మేరకు నియమించక పోవడం, లేబరేటరీలు సరిపడా లేకపోవడం తదితర కారణాలతో మొత్తం 520 సీట్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసినట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు, ఆయా కళాశాలల యాజమాన్యాలకు లేఖ రాసింది. దీంతో కన్వీనర్, బీ, సీ కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటాల్లో అడ్మిషన్ కోసం లక్షల రూపాయలు చెల్లించి, రోజూ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, అడ్మిషన్ల రద్దుపై ఈ మూడు కాలేజీలు ఎన్‌ఎంసీకి అప్పీలుకు వెళ్లాయి.
చదవండి:
Published date : 31 May 2022 01:31PM