Skip to main content

YSRUHS: ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడో రేపో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.
YSRUHS
ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 17 ప్రభుత్వ, 16 ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 6 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉంటాయి. నోటిఫికేషన్‌ జారీకి అన్ని ఏర్పాట్లు చేశామని వీసీ డాక్టర్‌ బాబ్జీ తెలిపారు. కాగా 15 శాతం ఆలిండియా కోటా సీట్ల భర్తీకి ఇప్పటికే మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది.

చదవండి: YSRUHS: పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు

ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు జూలై 20 నుంచి 25వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్‌/పేమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 22 నుంచి 26వ తేదీ మధ్య విద్యార్థులు చాయిస్‌లు నమోదు చేసుకోవచ్చు. 27, 28 తేదీల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఆగస్టు 6వ తేదీ నాటికి తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది.

చదవండి: యూనివర్సిటీకి వీసీ అయిన తొలి దళిత వ్యక్తిని నేనే.. నంబర్‌ వన్‌ వర్సిటీగా తీర్చిదిద్దుతా

Published date : 18 Jul 2023 04:08PM

Photo Stories