MDS: ఎండీఎస్ మొదటి విడత కౌన్సెలింగ్ వివరాలు..
Sakshi Education
ఎండీఎస్ సీట్ల భర్తీకి అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు విశ్వవిద్యాలయం అక్టోబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అక్టోబర్ 9 ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. మెరిట్ జాబితా, సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని పేర్కొంది.
Published date : 09 Oct 2021 03:39PM