Admissions 2024: ఏపీ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
అనంతపురం : జిల్లాలోని ఏపీ గురుకుల పాఠశాలల్లో (గుత్తి బాలికలు, నూతిమడుగు బాలురు) 5 తరగతి, 6,7,8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లు, గురుకుల కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి, నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించారు. వాస్తవానికి ఆదివారం నాటికి గడువు ముగిసింది. ఈనెల 5 వరకు పొడిగించినట్లు జిల్లా ఏపీఆర్‌ఎస్,జేసీ,డీసీ కోఆర్డినేటర్ జీఏ విజయలత ఓ ప్రకటనలో తెలియజేశారు. ఏప్రిల్ 25న రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. గార్లదిన్నె మైనార్టీ బాలుర పాఠశాలలో నేరుగా అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విజయలత కోరారు.
Published date : 01 Apr 2024 11:06AM
Tags
- Extension of application deadline in AP Gurukul schools
- Welfare Gurukula Vidyalayas Admission News
- AP Social Welfare Gurukula Vidyalayas Admission 2024
- AP Social Welfare Gurukula Vidyalayas
- Admission 2024
- sakshieducation latest news
- ApplicationDeadline
- RemainingSeats
- Anantapuram
- APGurukulaSchools
- GurukulaColleges
- FirstYearAdmission
- EntranceExamination
- DegreeCollege
- Nagarjunasagar
- CoordinatorGAVijayalatha
- SakshiEducationUpdates