మూడు వర్సిటీలకు వీసీల నియామకం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 3 యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్‌లను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది.
ఒంగోలులో ఏర్పాటు చేసిన ఆంధ్ర కేసరి వర్సిటీకి హైదరాబాద్ జేఎన్‌టీయూ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ప్రొఫెసర్ అంజిరెడ్డి మారెడ్డిని నియమించారు. విజయనగరంలోని జేఎన్‌టీయూ గురజాడ వర్సిటీకి ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్. కె.వెంకట సుబ్బయ్యను నియమించారు.
చదవండి: Governor: వర్సిటీల్లో విద్యార్థుల హెల్త్‌రికార్డ్
కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీకి హైదరాబాద్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ విభాగంలోని ప్రొఫెసర్ బానోత్ ఆంజనేయ ప్రసాద్‌ను నియమించారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది.
చదవండి: UGC: ఉన్నత విద్యలో ‘షేరింగ్’
Published date : 10 Feb 2023 03:40PM