Skip to main content

CTET 2021 Exam Postponed: సీటెట్-2021 ప‌రీక్ష వాయిదా..కార‌ణం ఇదే

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ప‌రీక్ష డిసెంబ‌ర్ 16వ తేదీన‌ దేశ వ్యాప్తంగా ప్రారంభ‌మైంది. ఆన్‌లైన్‌లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తుండ‌గా.. సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది.
CTET Exam Postponed
CTET Exam Postponed

దీంతో ఈ ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. తొలిసారి ఈ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించారు. డిసెంబ‌ర్ 16వ తేదీన కొందరు విద్యార్ధులు సీటెట్‌-2021 మొదటి పేపర్ ను సాంకేతిక కారణాలతో రాయలేకపోయారు. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో.. రెండో పేపర్ ను కూడా రద్దు చేయాల్సి వచ్చిందని సీబీఎస్ఈ ప్ర‌కటించింది. వీటిని ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

ఈ పరీక్షలో అర్హత సాధిస్తే..
కేంద్రీయ విద్యాలయ సమితి(కేవీఎస్‌), నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌)లో పనిచేసే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) చేపడుతుంది. ఇందుకోసం ‘సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)’ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కేవీఎస్, ఎన్‌వీఎస్‌ రిక్రూట్‌మెంట్‌కు అర్హత సాధిస్తారు.అలాగే సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా కూడా పనిచేయవచ్చు. 

ఈ ట్రిక్స్ పాటిస్తే..CTET-2021లో విజయం మీదే

అర్హతలు ఇవే..
➤ సీటెట్‌లో రెండు పరీక్ష పేపర్లు(పేపర్‌–1, పేపర్‌– 2) ఉంటాయి. వీరికి వేర్వేరు విద్యార్హతలను నిర్దేశించారు. 
➤ పేపర్‌1(ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే వారికి ఉద్దేశించింది): అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతలో 50 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈడీ) పూర్తిచేయాలి. లేదా ఇంటర్‌ 50 శాతం మార్కులతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిగ్రీ (B.El.Ed) పూర్తి చేయాలి. లేదా ఇంటర్మీడియట్‌తోపాటు డిప్లొ మా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పాసవ్వాలి. 
➤ పేపర్‌ 2(ఆరు నుంచి ఎనిమిది తరగతులకు బోధించే వారికి నిర్వహించే పరీక్ష): అభ్యర్థులు డిగ్రీతోపాటు రెండేళ్ల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిప్లొమా (D.El.Ed), లేదా 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ ప్రథమ శ్రేణిలో పూర్తిచేయాలి. లేదా ఇంటర్మీడియట్, తత్సమాన అర్హతతోపాటు 50శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (B.EI.Ed) పూర్తిచేయాలి. లేదా నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్‌ 50 శాతం మార్కులతో పూర్తి చేసినవారు అర్హులు. 
➤ అన్ని కేటగిరీల్లో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/వికలాంగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషను అమలుతోపాటు అర్హత మార్కుల్లో ఐదు శాతం సడలింపునిచ్చారు. 
➤ రెండు స్థాయిల(1 నుంచి ఐదు, ఆరు నుంచి ఎనిమిది) విద్యార్థులకు బోధించాలనుకునే వారు రెండు పేపర్ల(పేపర్‌1, పేపర్‌2)కు హాజరుకావచ్చు. 

జీవిత కాలం చెల్లుబాటు..
సీటెట్‌ రాసేందుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు వారి నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి,  స్కోర్‌ మెరుగుపరచుకునేందుకు హాజరు కావచ్చు. గతంలో సీటెట్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు సైతం స్కోరును పెంచుకునేందుకు మరోసారి ప్రయత్నించవచ్చు. కనీసం 60 శాతం మార్కులు సాధిస్తేనే.. సీటెట్‌లో అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు. ఒకసారి సీటెట్‌లో అర్హత సాధిస్తే.. అది జీవిత కాలం చెల్లుబాటు అవుతుంది. 

ఆన్‌లైన్‌లో... : 
గతేడాది వరకు సీటెట్‌ను పేపర్, పెన్‌ విధానంలో నిర్వహించేవారు. 2021 డిసెంబర్‌ సెషన్‌ నుంచి ‘ఆన్‌లైన్‌’లో నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది. సీటెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. పేపర్‌ 1లో 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటాయి. అలాగే పేపర్‌ 2లో 150 ప్రశ్నలు–150 మార్కులకు అడుగుతారు. ఎలాంటి నెగిటివ్‌ మార్కులు లేవు. ప్రతి పేపర్‌కు పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. 

సిలబస్‌ అంశాలు–మార్కులు : 
పేపర్‌–1: (1 నుంచి 5 తరగతులు)
➤ శిశు వికాసం, బోధన–30 ప్రశ్నలు–30 మార్కులు
➤ లాంగ్వేజ్‌–1–30 ప్రశ్నలు–30 మార్కులు
➤ లాంగ్వేజ్‌–2–30 ప్రశ్నలు–30 మార్కులు
➤ మ్యాథమెటిక్స్‌–30 ప్రశ్నలు–30 మార్కులు
➤ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌–30 ప్రశ్నలు–30 మార్కులు
➤ మొత్తంగా 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

పేపర్‌–2 (6 నుంచి 8 తరగతుల బోధకులకు) :
➤ శిశు వికాసం, బోధన–30 ప్రశ్నలు–30 మార్కులు;
➤ లాంగ్వేజ్‌–1–30 ప్రశ్నలు–30 మార్కులు; 
➤ లాంగ్వేజ్‌–2–30 ప్రశ్నలు– 30 మార్కులు; 
➤ మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌–60 ప్రశ్నలు–60 మార్కులు; లేదా 
➤ సోషల్‌ స్టడీస్‌–60 ప్రశ్నలు–60 మార్కులు;
➤ మొత్తంగా 150 ప్రశ్నలు–150 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

ఇలా చ‌దివితే విజయం మీదే..
తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది డీఈడీ/బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ‘టెట్‌’ రాసిన అనుభం ఉంటుంది. సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌) సిలబస్‌ కూడా టెట్‌ సిలబస్‌ మాదిరిగానే ఉంటుంది. సీటెట్‌లో సబ్జెక్టులతోపాటు నైపుణ్య సంబంధ ప్రశ్నలు కూడా అడుగుతారు. అందుకు అనుగుణంగా అభ్యర్థులు సిద్ధం కావాలి. పరీక్షకు ఇంకా దాదాపు మూడు నెలల వ్యవధి ఉంది. కాబట్టి సిలబస్‌ను పరిశీలించి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. సీటెట్‌ గత ప్రశ్న పత్రాలను సేకరించి కంటెంట్, సైకాలజీ, మెథడాలజీ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గమనించాలి. ప్రశ్నల స్థాయిని అంచనా వేసుకోవాలి. పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించి.. వాటికి కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. సీటెట్‌ ‘ఆన్‌లైన్‌’లో మాత్రమే ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా మోడల్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. 

Tricks : ఇలా చ‌దివితే..CTET-2021లో ఈజీగా 120 మార్కులు గ్యారెంటీ

 

Published date : 17 Dec 2021 01:52PM

Photo Stories