యాక్చురియల్ సైన్స్‌లో ఇవి పూర్తి చేసిన వారికి విదేశాల్లో సైతం మంచి వేతనంతో ఉపాధి అవకాశాలు..!
Sakshi Education
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరియస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) అందించే కోర్సులు పూర్తి చేసుకొని, సర్టిఫికెట్ సొంతం చేసుకుంటే..
బీమా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. సీఏ, ఐసీడబ్లు్యఏ మాదిరిగానే ఐఏఐ కూడా మూడు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించి సదరు స్థాయికి అనుగుణంగా మెంబర్‌షిప్ హోదా కల్పిస్తుంది. అవి..
ఐఏఐ అందించే మూడు మెంబర్‌షిప్ హోదాల్లో మొదటగా స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు పొం దాలి. ఇందుకోసం సంస్థ యాక్చురియల్æ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏసీఈటీ) నిర్వహిస్తుంది. దీనికి అర్హత ఇంటర్మీడియెట్. వంద మార్కులకు ఉండే ఏసీఈటీ పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటాఇంటర్‌ప్రిటేషన్‌పై ప్రశ్నలు అడు గుతారు. రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో కనీసం 50మార్కులు సాధిస్తే.. తర్వాతి కోర్ అంశాలకు సంబంధించి నిర్వహించే నాలుగు దశల పరీక్షలకు నమోదు చేసుకునేందుకు అర్హత లభించడంతోపాటు స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు దక్కుతుంది. ఈ సంవత్సరం ఈ పరీక్షను హోమ్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌గా నిర్వహిస్తున్నారు.
ఏసీఈటీ తర్వాత దశలు..
ఏసీఈటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. ఐఏఐ నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హత లభిస్తుంది. ఆ నాలుగు దశల వివరాలు..
ఏసీఈటీ ఉత్తీర్ణత సాధించి స్టూడెంట్ మెంబర్ హోదాతో తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షల్లో ప్రతిభ చూపితే.. అసోసియేట్ మెంబర్ హోదా లభిస్తుంది. నాలుగు దశలూ పూర్తి చేసుకుని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే.. ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. ప్రస్తుతం దేశంలో యాక్చురీ నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి అసోసియేట్ మెంబర్‌షిప్ సర్టిఫికెట్‌తోనే అవకాశాలు లభిస్తున్నాయి. బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి.
ఇంకా చదవండి: part 2: బీమా రంగంలో మంచి డిమాండ్ ఉన్న యాక్చురియల్ సైన్స్.. ఉపాధి అవకాశాలు ఇలా..!
- స్టూడెంట్ మెంబర్
- అసోసియేట్ మెంబర్
- ఫెలో మెంబర్.

- స్టేజ్–1 కోర్ టెక్నికల్: ఇందులో యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చూరియల్æ మ్యాథమెటిక్స్, యాక్చూరియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లుంటాయి.
- స్టేజ్–2 కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చురియల్ రిస్క్ మేనేజ్‌మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాలి.
- స్టేజ్–3 స్పెషలిస్ట్ టెక్నీషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లుంటాయి. ఈ ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండింటిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
- స్టేజ్–4 స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చురియల్ సైన్స్‌కు సంబంధించి ఐఏఐ నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లుంటాయి. అభ్యర్థులు ఏదో ఒక పేపర్‌ను ఎంచుకొని అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఐఏఐ యాక్చూరియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే!
ఏసీఈటీ ఉత్తీర్ణత సాధించి స్టూడెంట్ మెంబర్ హోదాతో తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షల్లో ప్రతిభ చూపితే.. అసోసియేట్ మెంబర్ హోదా లభిస్తుంది. నాలుగు దశలూ పూర్తి చేసుకుని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే.. ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. ప్రస్తుతం దేశంలో యాక్చురీ నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి అసోసియేట్ మెంబర్‌షిప్ సర్టిఫికెట్‌తోనే అవకాశాలు లభిస్తున్నాయి. బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి.
ఇంకా చదవండి: part 2: బీమా రంగంలో మంచి డిమాండ్ ఉన్న యాక్చురియల్ సైన్స్.. ఉపాధి అవకాశాలు ఇలా..!
Published date : 18 Dec 2020 04:12PM