విదేశీ విద్యార్థులకు ఐఐటీల కానుక!
Sakshi Education
ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అడ్వాన్స్‌డ్‌కు హాజరవ్వాలంటే.. జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించడమే కాకుండా.. +2, లేదా తత్సమాన కోర్సుల్లో టాప్ 20 పర్సంటైల్‌లో నిలవాలి! భారత విద్యార్థులైనా, ప్రవాస భారతీయుల పిల్లలైనా, భారత సంతతికి చెందిన వారైనా.. ఇతర దేశాల విద్యార్థులైనా.. ఇప్పటివరకు ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ + ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అనుసరిస్తున్న విధానమిది.
ఐఐటీలు ఇప్పుడు అంతర్జాతీయ విద్యార్థులకు నిబంధనలను సడలిస్తున్నాయి. ముఖ్యంగా తొమ్మిది దేశాల విద్యార్థులకు నేరుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నాయి. దీనిపై గతవారం ఐఐటీ ప్రవేశాలకు సంబంధించిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ సమావేశంలో ఐఐటీ కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ ప్రతిపాదనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభిస్తే.. తొమ్మిది దేశాలకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించకుండానే నేరుగా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆ తొమ్మిది దేశాలు
అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, సింగపూర్, యూఏఈ, ఇథియోపియా. వీటిలో ఇథియోపియా మినహా మిగిలినవన్నీ ఆసియా ఖండంలోనివే. ఈ తొమ్మిది దేశాల విద్యార్థులు నేరుగా అడ్వాన్స్‌డ్ రాసేలా అనుమతిచ్చే చర్యలకు ఐఐటీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఈ దేశాల్లో అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించనుంది. ఈ దేశాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే కొత్త విధానం అమలు, కార్యాచరణ బాధ్యతలను ఐఐటీ - బాంబే చేపట్టనున్నట్లు తెలిసింది. వాస్తవానికి విదేశీ విద్యార్థులకు ఐఐటీల గురించి అవగాహన, ఆసక్తి ఉన్నప్పటికీ రెండంచెల పరీక్ష విధానం, పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో నిరాసక్తత చూపుతున్నారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను కొలంబో, ఖాట్మండు, సింగపూర్, బహ్రెయిన్, దుబాయ్, మస్కట్, రియాద్, షార్జాలలో నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలు దుబాయ్, యూఏఈలో మాత్రమే ఉన్నాయి. ఈ కారణాలతో విదేశీ విద్యార్థులు ఐఐటీలపై దృష్టిసారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తొమ్మిది దేశాల్లోనూ నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేలా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ దేశాలకే ఎందుకు?
అమెరికా, యూకే వంటి దేశాల్లో సైతం ప్రత్యేక బ్రాండ్‌ను సొంతం చేసుకున్న ఐఐటీలు.. అటువైపు చూడకుండా ఈ తొమ్మిది దేశాలనే లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముందుగా సార్క్ కూటమిలోని పొరుగు దేశాల విద్యార్థులు మొబిలిటీ, కల్చరల్ డైవర్సిటీ వంటి విషయాల్లో భారత పరిస్థితుల్లో ఇమడగలిగే అవకాశం ఉంటుంది. సార్క్ కూటమిలో ఉండటంతోపాటు భారత్‌లో చదవాలని ఈ దేశాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నందున వీటిని ఎంపిక చేశారు. అలాగే ఆసియా ఖండంలో లేనప్పటికీ.. ఇథియోపియా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు భారత్‌పై ఆసక్తి చూపుతుండటంతో ఆ దేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. జేఈఈ మెయిన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా పేర్కొన్న నిబంధనలను యథాతథంగా అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఈ దేశాల విద్యార్థులకు జనరల్ కేటగిరీ విద్యార్థుల నిబంధనలు వర్తిస్తాయి. కామన్ మెరిట్ లిస్ట్‌లో నిలవాలి. +2, తత్సమాన బోర్డ్ పరీక్షలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి.
అంతర్జాతీయ విద్యార్థులు..గ్లోబల్ ర్యాంకులు
అంతర్జాతీయంగా ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో ఒక ఇన్‌స్టిట్యూట్‌లోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య కూడా ఒక పరామితిగా ఉంటోంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ అనగానే గుర్తొచ్చే క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ ర్యాంకింగ్స్, అకడమిక్ ర్యాంకింగ్స్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీస్ నిర్వాహకులు ర్యాంకులు కేటాయించేటప్పుడు పరిగణనలోకి తీసుకొనే అయిదారు పరామితుల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంశం కూడా ఉంటోంది. రీసెర్చ్, ఫ్యాకల్టీ సైటేషన్స్, ఔట్‌కమ్ వంటి విషయాల్లో మన ఇన్‌స్టిట్యూట్స్ మెరుగైన పాయింట్లు సాధిస్తున్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పారామీటర్ విషయంలో వెనుకంజలో ఉంటున్నాయి. ఉదాహరణకు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2015-16ను పరిగణనలోకి తీసుకుంటే.. 179వ ర్యాంకులో నిలిచిన ఐఐటీ ఢిల్లీ మిగిలిన పారామీటర్స్‌లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రాతిపదిక పరంగా చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఐఐటీ-బాంబేలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థులు 50. కాగా, 18 శాతం మందే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు. ఇలా.. ఇంటర్నేషనల్ స్టూడెంట్ పారామీటర్‌లో తక్కువ స్కోరింగ్ లేదా నిల్ స్కోరింగ్ అనేది మొత్తం ర్యాంకులపై ప్రభావం చూపుతోందన్న ఉద్దేశంతో ఐఐటీలు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది నుంచే అమల్లోకి!
తాజా ప్రతిపాదనను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఐఐటీ కౌన్సిల్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు మరికొద్ది రోజుల్లో పంపనుంది. ఎంహెచ్‌ఆర్‌డీ ఆమోదం లభించాక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటుంది. ఈ రెండు ప్రక్రియలు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని ఐఐటీ కౌన్సిల్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇది జరిగితే జేఈఈ అడ్వాన్స్‌డ్-2017 నోటిఫికేషన్‌లోనే సంబంధిత మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు చేపట్టిన తాజా ప్రతిపాదనను ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, ఐఐటీలకే పరిమితం చేయనున్నారు. రెండు, మూడేళ్ల తర్వాత స్పందన ఆధారంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా వర్తింపజేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఐఐటీలు అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు యోచిస్తున్న తరుణంలో భారత విద్యార్థులు తమ అవకాశాలు చేజారుతాయని ఆందోళన చెందనవసరం లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం ప్రత్యేకంగా పది శాతం సూపర్ న్యూమరరీ సీట్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే.. ప్రస్తుతం దేశంలోని ఐఐటీల్లో బీటెక్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో దాదాపు 11 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి పది శాతం అంటే దాదాపు 1100 సీట్లను అదనంగా పెంచి, అంతర్జాతీయ విద్యార్థులకు కేటాయిస్తారు.
క్యూఎస్ గ్లోబల్ ర్యాంక్స్ (2015-16) జాబితాలో నిలిచిన ఐఐటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య
ఢిల్లీ ఐఐటీ
ర్యాంకు - 179
విదేశీ విద్యార్థులు - 80
పీజీ విద్యార్థులు - 100%
యూజీ విద్యార్థులు - 0%
ముంబై ఐఐటీ
ర్యాంకు - 202
విదేశీ విద్యార్థులు - 50
పీజీ విద్యార్థులు - 82%
యూజీ విద్యార్థులు - 18%
మద్రాస్ ఐఐటీ
ర్యాంకు - 254
విదేశీ విద్యార్థులు - 5
పీజీ విద్యార్థులు - 80%
యూజీ విద్యార్థులు - 20%
కాన్పూర్ ఐఐటీ
ర్యాంకు - 271
విదేశీ విద్యార్థులు - 36
పీజీ విద్యార్థులు - 72%
యూజీ విద్యార్థులు - 28%
ఖరగ్‌పూర్ ఐఐటీ
ర్యాంకు - 286
విదేశీ విద్యార్థులు - 8
పీజీ విద్యార్థులు - 0%
యూజీ విద్యార్థులు - 100%
రూర్కీ ఐఐటీ
ర్యాంకు - 391
విదేశీ విద్యార్థులు - 99
పీజీ విద్యార్థులు - 100%
యూజీ విద్యార్థులు - 0%
గువహటి ఐఐటీ
ర్యాంకు - 451-460
విదేశీ విద్యార్థులు - 39

తాజా ప్రతిపాదన వల్ల ఐఐటీలు.. గ్లోబల్ ర్యాంకులకు సంబంధించి ఒక్క అంతర్జాతీయ విద్యార్థుల విభాగంలోనే ముందంజలో ఉంటాయనుకోవడం సరికాదు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల తొలుత ‘మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య’ అనేదే ప్రధానంగా నిలిచినప్పటికీ.. తొలి బ్యాచ్ పూర్తయ్యేసరికి నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ఔట్‌కమ్ వంటి ఇతర పారామీటర్స్‌లోనూ మెరుగైన పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ఫ్యాకల్టీ సైతం ఐఐటీలపై ఆసక్తి చూపే పరిస్థితి వస్తుంది. ఇది జరిగితే గ్లోబల్ ర్యాంకుల్లో ఇతర ప్రామాణికాలైన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ వంటి వాటిలో మెరుగుదల సాధ్యమవుతుంది. - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్‌కుమార్, డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్. |
Published date : 10 Sep 2016 02:12PM