విదేశాల్లో యూజీ కోర్సులు చదివేందుకు మరో మార్గం ఏసీటీ.. తెలుసుకోండిలా..
Sakshi Education
విదేశాల్లో యూజీ కోర్సులు అభ్యసించాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మరో మార్గం.. ఏసీటీ(అమెరికన్ కాలేజ్ టెస్టింగ్).
ఈ పరీక్షలో నాలుగు విభాగాలుంటాయి. అవి.. ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్. ఇంగ్లిష్ నుంచి 75ప్రశ్నలు(సమయం 45నిమిషాలు); మ్యాథమెటిక్స్ నుంచి 60 ప్రశ్నలు (సమయం 60 నిమిషాలు); రీడింగ్ నుంచి 40 ప్రశ్నలు (సమయం 35 నిమిషాలు); సైన్స్ నుంచి 40 ప్రశ్నలు(సమయం 35 నిమిషాలు) అడుగుతారు. ఏసీటీ పరీక్ష సమయం 2 గంటల 55 నిమిషాలు. దీనికి అదనంగా 40 నిమిషాల వ్యవధిలో ఒక ఎస్సే రైటింగ్ టాస్క్ కూడా ఉంటుంది. ఇది కూడా శాట్ మాదిరిగానే అభ్యర్థుల ఆప్షన్ మేరకే. ఇష్టం లేకుంటే రాయాల్సిన అవసరం లేదు. స్కోరింగ్ విధానం గరిష్టంగా 36 పాయింట్లుగా ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.atc.org
ఇంకా చదవండి: part 5: ఈ లాంగ్వేజ్ టెస్ట్‌లు.. ఏడాది పొడవునా రాయొచ్చు..
Published date : 05 Mar 2021 05:14PM