ఉజ్వల కెరీర్ కు కేరాఫ్ వెటర్నరీ కోర్సులు..
Sakshi Education
మన దేశంలో వ్యవసాయంతోపాటు వ్యవసాయ ఆధారిత పాడి పరిశ్రమ మీద జీవనం సాగించే జనాభా ఎక్కువ. వ్యవసాయంలో ఒడిదొడుకులు ఎదురైనా.. పాడి పరిశ్రమ రైతును ఆదుకోవడంలో ముందుంటుంది. పశుపోషణలో భాగంగా జీవాలు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో పశువైద్యుల సేవలు కీలకం. తద్వారా పాడి ఉత్పత్తులను పెంపొందించడంలో వెటర్నరీ డాక్టర్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని వెటర్నరీ యూనివర్సిటీల్లో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవీఎస్సీ), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌లు విడుదలవుతున్న నేపథ్యంలో వెటర్నరీ సైన్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ...
ప్రపంచంలో పశుపోషణలో భారత్ వాటా 15 శాతం. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం, గుడ్ల ఉత్పత్తిలో ఐదో స్థానం, చేపల పెంపకంలో మూడో స్థానంలో ఉంది మన దేశం. వ్యవసాయానుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. సంబంధిత కోర్సులకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. దేశంలో పౌల్ట్రీ రంగం విస్తరిస్తోంది. డెయిరీ ఫామ్‌ల ఏర్పాటుపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు నగరాలు, పట్టణాల్లో మూగ జీవులపై ప్రేమతో పెంపుడు జంతువుల(పెట్స్) సంస్కృతి విస్తరిస్తోంది. వీటి కారణంగా వెటర్నరీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు లభించని విద్యార్థులకు వెటర్నరీ సైన్స్ మంచి ప్రత్యామ్నయ కోర్సుగా నిలుస్తోంది.
వెటర్నరీ కోర్సులు ఇవే..
తెలంగాణ, ఏపీల్లో వెటర్నరీ కాలేజీలు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వెటర్నరీ యూనివర్సిటీలు ఇటీవల విడుదల చేసిన ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కింద వెబ్‌సైట్స్‌ను చూడొచ్చు.
ముఖ్యమైన వెబ్‌సైట్స్:
కొలువులు... కెరీర్ స్కోప్
బీవీఎస్సీ, యానిమల్ హజ్బెండరీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు అవకాశాలకు కొదవలేదు. సాధారణంగా వెటర్నరీ సైన్స్ అంటే వెటర్నరీ డాక్టర్‌తోపాటు, వెటర్నరీ క్లినిక్‌లలో పారా-వెటర్నరీ స్టాఫ్‌లు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ విభాగం క్రమంగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. అర్హులైన అభ్యర్థులకు కార్పొరేట్ అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో డెయిరీ ఉత్పత్తుల సంస్థలు, లైవ్‌స్టాక్ సీడింగ్ సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్, పౌల్ట్రీ ఫీడ్ ప్రొడక్షన్ సంస్థలు, అగ్రి ప్రొడక్ట్ సంస్థల్లో సైతం కొలువులు సొంతం చేసుకోవచ్చు. యానిమల్ డ్రగ్ ప్రొడక్షన్ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ సంస్థల్లోనూ ఉపాధి లభిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులకు ప్రారంభం నుంచే మంచి వేతనాలు అందుతున్నాయి.
రీసెర్చ్‌లోనూ..
ఉన్నత విద్య.. ఉత్తమ స్పెషలైజేషన్లు
జాతీయ స్థాయిలో నీట్:
వెటర్నరీ విద్య ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గతంలో జాతీయస్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్ (ఏఐపీవీటీ) ను నిర్వహించేది. దీనిద్వారా జాతీయ స్థాయిలో ఉన్న పలు కాలేజీల్లో 15 శాతం సీట్లు భర్తీ చేసేవారు. కానీ ఇప్పుడు నీట్ ద్వారా రాష్ట్రస్థాయి వెటర్నరీ కళాశాలల్లోని బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు.
వెటర్నరీ కోర్సులు ఇవే..
- వెటర్నరీ సైన్స్‌కు సంబంధించి బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సుల్లో చేరడం ద్వారా వెటర్నరీ డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
- బ్యాచిలర్ స్థాయిలో కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ) అని పేర్కొంటారు. ఈ కోర్సును పూర్తి చేస్తే వెటర్నరీ డాక్టర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. ఈ కోర్సులో చేరడానికి అర్హత ఇంటర్మీడియట్ (బైపీసీ).
- బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌తో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) వంటి అనుబంధ కోర్సులను కూడా పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
- బీవీఎస్సీ అండ్ ఏహెచ్ తర్వాత ఆసక్తి మేరకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం ఉంది. పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- వెటర్నరీ సైన్స్‌లో పీజీ స్థాయి కోర్సును ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్)గా వ్యవహరిస్తారు. ఎంవీఎస్సీ పూర్తయ్యాక ఆసక్తి ఉంటే పీహెచ్‌డీలో చేరొచ్చు.
తెలంగాణ, ఏపీల్లో వెటర్నరీ కాలేజీలు...
- తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ కోర్సులను అందించడంలో పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ముందుంటున్నాయి. వీటికి అనుబంధంగా మరికొన్ని కాలేజీలు ఆయా కోర్సులను అందిస్తున్నాయి.
- తెలంగాణలో పి.వి.నర్సింహారావు యూనివర్సిటీకి అనుబంధంగా కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, రాజేంద్రనగర్; కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల, జగిత్యాల జిల్లా; కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, కామారెడ్డి, నిజామాబాద్, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, వనపర్తి ఉన్నాయి.
- శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (సీవీఎస్సీ) తిరుపతి, ఎన్‌టీఆర్ సీవీఎస్సీ, గన్నవరం, సీవీఎస్సీ పొద్దుటూరు, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్తుకూరు, కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ తిరుపతి, సీవీఎస్సీ గరివిడి పనిచేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
- కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట్, మమ్నూరు (వరంగల్)లో యానిమల్ హజ్బెండరీలో పాలిటెక్నిక్ కోర్సులు అందించే సంస్థలు ఉన్నాయి.
- హైదరాబాద్‌లో పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్; మహబూబ్‌నగర్, వరంగల్‌లో లైవ్‌స్టాక్ రీసెర్చ్ స్టేషన్; ఖమ్మం జిల్లా పాలేరులో ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్‌లు ఏర్పాటయ్యాయి.
- ఎస్వీయూ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలు యానిమల్ హజ్బెండరీ, ఫిషరీల్లో డిప్లొమా కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. పీజీలో ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ, ఎంటెక్ కోర్సులు చేయవచ్చు. వీటిలోనూ స్పెషలైజేషన్స్ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వెటర్నరీ యూనివర్సిటీలు ఇటీవల విడుదల చేసిన ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కింద వెబ్‌సైట్స్‌ను చూడొచ్చు.
ముఖ్యమైన వెబ్‌సైట్స్:
కొలువులు... కెరీర్ స్కోప్
బీవీఎస్సీ, యానిమల్ హజ్బెండరీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు అవకాశాలకు కొదవలేదు. సాధారణంగా వెటర్నరీ సైన్స్ అంటే వెటర్నరీ డాక్టర్‌తోపాటు, వెటర్నరీ క్లినిక్‌లలో పారా-వెటర్నరీ స్టాఫ్‌లు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ విభాగం క్రమంగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. అర్హులైన అభ్యర్థులకు కార్పొరేట్ అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో డెయిరీ ఉత్పత్తుల సంస్థలు, లైవ్‌స్టాక్ సీడింగ్ సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్, పౌల్ట్రీ ఫీడ్ ప్రొడక్షన్ సంస్థలు, అగ్రి ప్రొడక్ట్ సంస్థల్లో సైతం కొలువులు సొంతం చేసుకోవచ్చు. యానిమల్ డ్రగ్ ప్రొడక్షన్ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ సంస్థల్లోనూ ఉపాధి లభిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులకు ప్రారంభం నుంచే మంచి వేతనాలు అందుతున్నాయి.
రీసెర్చ్‌లోనూ..
- దేశంలో జంతు సంపద వృద్ధి, సంబంధిత రంగాల్లో సమస్యల పరిష్కారం దిశగా రీసెర్చ్ నిపుణుల ఆవశ్యకత పెరుగుతోంది. వెటర్నరీ సైన్స్, యానిమల్ హజ్బెండరీ, డెయిరీ టెక్నాలజీ, ఫిషరీస్ టెక్నాలజీల్లో పీహెచ్‌డీ చేసిన వారికి ఆర్ అండ్ డీ కేంద్రాలు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తదితర ప్రముఖ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలతో కెరీర్ ప్రారంభించొచ్చు.
- వెటర్నరీ సైన్స్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. సొంతగా పెట్ కేర్ క్లినిక్స్ ఏర్పాటు చేసుకోవడం ఇందులో ప్రధానమైంది. ఇటీవల మెట్రో నగరాల్లో పెట్ యానిమల్స్ అడాప్షన్ పెరుగుతున్న క్రమంలో వెటర్నరీ వైద్యుల అవసరం పెరుగుతోంది. ఇదే వెటర్నరీ రంగంలో స్వయం ఉపాధికి ప్రధానంగా మారుతోంది.
- ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశముంది. ఐసీఏఆర్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో శాస్త్రవేత్తగా ఎంపికై తే నెలకు రూ. 50 వేల వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది.
ఉన్నత విద్య.. ఉత్తమ స్పెషలైజేషన్లు
- ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా బీవీఎస్సీ తర్వాత ఎంవీఎస్‌సీలో పలు స్పెషలైజేషన్లు ఉన్నప్పటికీ.. బ్యాక్టీరియాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, లైవ్ స్టాక్ ప్రొడక్ట్ టెక్నాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడమాలజీలు అత్యుత్తమ స్పెషలైజేషన్లుగా మార్కెట్‌లో డిమాండ్ నెలకొంది.
జాతీయ స్థాయిలో నీట్:
వెటర్నరీ విద్య ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) గతంలో జాతీయస్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్ (ఏఐపీవీటీ) ను నిర్వహించేది. దీనిద్వారా జాతీయ స్థాయిలో ఉన్న పలు కాలేజీల్లో 15 శాతం సీట్లు భర్తీ చేసేవారు. కానీ ఇప్పుడు నీట్ ద్వారా రాష్ట్రస్థాయి వెటర్నరీ కళాశాలల్లోని బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు.
Published date : 10 Dec 2018 03:50PM