ఉద్యోగ వేటలో దూసుకుపోతున్న ఫోరెన్సిక్ సైన్స్.. అసలేంటిది?
Sakshi Education
‘ఫోరెన్సిక్ ల్యాబ్’.. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు వార్తల్లో వినిపించే పేరు. కేసు దర్యాప్తులో భాగంగా నేరస్తులను గుర్తించేందుకు..
నేరం జరిగిన తీరును కచ్చితంగా తెలుసుకునేందుకు పోలీసులు ఫోరెన్సిక్ సైంటిస్టుల సహాయం తీసుకుంటారు. నేర సంబంధ వార్తలు చదివినప్పుడు, టీవీల్లో చూసినప్పుడు కూడా ‘ఫోరెన్సిక్ సైన్స్’ పేరు వినే ఉంటాం. నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఫోరెన్సిక్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతోంది.
ఫోరెన్సిక్ సైన్స్ అంటే..
మోసాలు, హత్యలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు, మార్ఫింగ్‌లు.. తదితర నేరాలకు సంబంధించి శాస్త్రీయంగా అన్వేషించి ఆధారాలు సేకరించి, విశ్లేషించి.. అసలైన దోషులను గుర్తించేందుకు దోహదపడేదే ఫోరెన్సిక్ సైన్స్. ఇదో మల్టీడిసిప్లినరీ విభాగం. ఫోరెన్సిక్ నిపుణులకు నేర నిర్ధారణలో సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, సైకాలజీ, సోషల్ సైన్స్‌లకు సంబంధించిన పరిజ్ఞానం అవసరం ఉంటుంది.

ఇంకా చదవండి: part 2: ఫోరెన్సిక్ సైన్స్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు అందిచ్చే సంస్థల గురించి తెలుసుకోండిలా..
Published date : 24 Nov 2020 01:53PM