టీసీఎస్ ‘ఇంటెలిజెమ్’ పోటీ వివరాలు తెలుసుకోండి.. మీ పిల్లలను ప్రోత్సాహించండి..
Sakshi Education
టీసీఎస్ 'ఇంటెలిజెమ్'ప్రోగ్రామ్‌లో పేర్లు రిజిస్టర్ చేసుకొని.. పోటీలో పాల్గొనే విద్యార్థులు 21వ శతాబ్దం నైపుణ్యాలు(క్రియేటివిటీ, ఇన్నోవేషన్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ లిటరసీ, యూనివర్సల్ వాల్యూస్, గ్లోబల్ సిటిజన్‌షిప్), వెబ్‌నార్లు, పజిల్స్, ఆటలు మొదలైన వాటిపై మెటీరియల్ పొందచ్చు. తద్వారా ఆయా అంశాలను నేర్చుకోవచ్చు.
మూడు రౌండ్లుగా పోటీ..
మూడు రౌండ్లుగా పోటీ..
- ఈ పోటీ మొత్తం మూడు రౌండ్లుగా జరుగుతుంది...
- మొదటిది, ఆన్‌లైన్ క్వాలిఫైయింగ్ రౌండ్
- రెండోది, ఫిజికల్-డిజిటల్ మోడ్‌లో ప్రీ-ఫైనల్ రౌండ్.
- వీటిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ‘గ్రాండ్ ఫైనల్’ నిర్వహిస్తారు. విద్యార్థులు దరఖాస్తు సమయంలోనే నిర్ణీత అయిదు విభాగాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలను ఎంచుకోవచ్చు. ప్రతిభ చూపిన వారికి ట్రోఫీలు, పతకాలు, ధ్రువపత్రాలతోపాటు నగదు బహుమతులు ప్రదానం చేస్తారు.
- పోటీలో పాల్గొనేవారు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్, దానికి ఇంటర్‌నెట్/ వైఫై, వెబ్ కెమెరా ఉండాలి. క్వాలిఫైయింగ్ రౌండ్ల సమయంలో వీటి అవసరం ఉంటుంది.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: intelligem.tcsion.com/ https://learning.tcsionhub.in/lifelonglearning/se/intelligem/
ఇంకా చదవండి: part 1: పిల్లల్లో నైపుణ్యాలు వెలికితిసే టీసీఎస్ ‘ఇంటెలిజెమ్’ నోటిఫికేషన్ విడుదల.. అర్హత వివరాలు ఇవిగో..
Published date : 21 Nov 2020 04:51PM