Skip to main content

టీఐఎఫ్‌ఆర్‌లో ప్రవేశం...పరిశోధనలకు సువర్ణాకాశం

మ్యాథ్స్, బేసిక్ సైన్స్ కోర్సుల్లో పరిశోధనలకు పేరొందిన సంస్థ.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్).
ఇది వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ (జీఎస్) అడ్మిష‌న్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ సెన్సైస్ (కమ్యూనికేషన్ అండ్ అప్లైడ్ ప్రాబబిలిటితో సహా), సైన్స్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఎందరినో నిష్ణాతులుగా తీర్చిదిద్దింది. ఇక్కడి మేధోసంపదకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ప్రఖ్యాత టీఐఎఫ్‌ఆర్‌లో చేరితే సుస్థిర కెరీర్‌కు బాటలు వేసుకున్నట్లే!

కోర్సులు-కాల వ్యవధి :
  • పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్)- కోర్సు కాల వ్యవధి ఐదేళ్లు.
  • ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్స్). కోర్సు కాల వ్యవధి ఆరేళ్లు.
  • ఎంఎస్సీ బయాలజీ-కోర్సు కాల వ్యవధి మూడేళ్లు.
ఎంపిక: సైన్స్ ఎడ్యుకేషన్ మినహాయించి మిగతా సబ్జెక్టులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. 2019, ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

కోర్సులు-అర్హతలు..
మ్యాథ్స్ :
పీహెచ్‌డీ: సంబంధిత సబ్జెక్టుతో ఎంఎస్సీ/ఎంఏ/ఎంటెక్.
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ: సంబంధిత సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ/బీఈ/బీటెక్. (ఎంఎస్సీ పూర్తిచేసిన/2019లో పూర్తిచేయబోయే విద్యార్థులు అర్హులు కాదు).
విద్యాసంస్థలు: స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీఐఎఫ్‌ఆర్ ముంబై; సెంటర్ ఫర్ అప్లికబుల్ మ్యాథమెటిక్స్, బెంగళూరు; ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సెన్సైస్ (ఐసీటీఎస్), బెంగళూరు.

ఫిజిక్స్ :
పీహెచ్‌డీ: ఎంఎస్సీ/ఎంఎస్(ఫిజిక్స్) లేదా తత్సమాన ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: ఫిజిక్స్‌లో బీఎస్సీ/బీఈ/ బీఎస్/బీటెక్/బీకెమ్/ఎంఈ/ఎంటెక్ లేదా ఇంజనీరింగ్ ఫిజిక్స్ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
విద్యాసంస్థలు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కండెన్సెడ్ మ్యాటర్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హైఎనర్జీ ఫిజిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ అటామిక్ ఫిజిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్, నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్‌సీఆర్‌ఏ), పుణె; టీసీఐఎస్, హైదరాబాద్, ఇంటర్నేషనల్ సెంట్రర్ ఫర్ థియరిటికల్ సెన్సైస్.

కెమిస్ట్రీ :
పీహెచ్‌డీ: ఎంఎస్సీ/బీఈ/బీటెక్/బీఫార్మసీ లేదా తత్సమాన డిగ్రీ.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: బీఎస్సీ/బీఫార్మసీ/బీఎస్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ. బీఈ, బీటెక్ విద్యార్థులకు కావాల్సిన అర్హతలు ఉంటే ఆప్షనల్‌గా ఎంఎస్సీ సీటు పొందే అవకాశముంది.
విద్యాసంస్థలు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ సెన్సైస్, టీఐఎఫ్‌ఆర్, ముంబై; టీసీఐఎస్, హైదరాబాద్.

కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్స్ :
(కమ్యూనికేషన్స్ అండ్ అప్లయిడ్ ప్రాబబిలిటీ)
పీహెచ్‌డీ
: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత బ్రాంచుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ కోర్సులు చేసినవారు అర్హులు. ఆయా బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసిన ప్రతిభావంతులు కూడా అర్హులే.
విద్యాసంస్థ: స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్(ఎస్‌టీసీఎస్), టీఐఎఫ్‌ఆర్, ముంబై.

బయాలజీ :

పీహెచ్‌డీ: బేసిక్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ(ఎంఎస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ బ్రాంచ్ కోర్సులు) లేదా ఎంఫార్మసీ, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సులు చేసిన అభ్యర్థులూ అర్హులే.
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ: బ్యాచిలర్స్ ఇన్ బేసిక్ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోర్సులు) లేదా బీటెక్, బీఈ, బీవీఎస్సీ, బీఫార్మసీ కోర్సులు చదివిన విద్యార్థులు ఈ కోర్సులో చేరొచ్చు.

పరీక్ష ఒకటి.. ప్రవేశాలెన్నో..
బయాలజీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ లైఫ్ సెన్సైస్ (జేజీఈఈబీ ఐఎల్‌ఎస్)గా వ్యవహరిస్తారు. ఈ పరీక్ష ద్వారా కేవలం టీఐఎఫ్‌ఆర్ క్యాంపస్‌ల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు; అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్-ముంబై; సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), హైదరాబాద్ తదితర ప్రముఖ సంస్థల్లో చేరొచ్చు. ఆయా సంస్థలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గేట్ స్కోరు ఉంటే..
  • ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) (2017-19)లో చక్కని ప్రతిభ కనబర్చిన ఇంజనీరింగ్ విద్యార్థులు టీఐఎఫ్‌ఆర్ ప్రవేశ పరీక్ష రాయకుండానే సిస్టమ్ సైన్స్ విభాగంలో నేరుగా పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గేట్ (2017-2019) ఎకాలజీ అండ్ ఎవల్యూషన్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులు నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రాంకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గేట్/నెట్/జెస్ట్ ఆధారంగా కూడా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో కొన్ని ప్రవేశాలు కల్పిస్తారు.

నెలకు రూ.28 వేల ఫెలోషిప్ :
 టీఐఎఫ్‌ఆర్ నిర్వహించే కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫెలోషిప్ రూపంలో పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.28 వేలు, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి సంవతర్సంలో నెలకు రూ.16 వేలు చెల్లిస్తారు. ఏడాది తర్వాత సంతృప్తికరమైన ప్రతిభ ప్రదర్శిస్తే మొత్తాన్ని రూ.25 వేలకు పెంచుతారు. పీహెచ్‌డీకి నమోదు చేసుకున్న అనంతరం రూ.28 వేలకు పెంచుతారు. అలానే, ఎంఎస్సీ బయాలజీ విద్యార్థులకు రూ.16 వేల ఫెలోషిప్ లభిస్తుంది. పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ విద్యార్థులకు నామమాత్రపు రుసుంతో వసతి ఏర్పాటు చేస్తారు.
 
 ప్రపంచవ్యాప్త గుర్తింపు :
 టీఐఎఫ్‌ఆర్.. దేశంలో పరిశోధనలకు పెద్దన్నగా భాసిల్లుతోంది. ఇక్కడ రీసెర్చ్ చేసిన విద్యార్థుల పరిశోధన పత్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జర్నల్స్‌లో  ప్రచురితమయ్యే అవకాశాలు పుష్కలం. అంతేకాదు, పరిశోధన సదస్సుల్లోనూ పత్రాలు సమర్పించే అవకాశం లభిస్తుంది. వీరికి ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలు సైతం పరిశోధనలు చేసేందుకు స్వాగతం పలుకుతుండటం విశేషం. అలానే, ప్రాక్టికల్ పరిజ్ఞానం   పెంచుకునేందుకు క్యాంపస్‌ల్లో అత్యున్నత సదుపాయాలు, మౌలిక వసతులు, లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి.
 
 ముఖ్య సమాచారం :
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
నవంబర్ 15, 2018
 ఆన్‌లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబర్ 16, 2018
 పోస్టు/కొరియర్ ద్వారా డీడీలు పంపించడానికి చివరితేదీ: 2018, నవంబర్ 16.
 దరఖాస్తు రుసుం: పురుష అభ్యర్థులకు రూ.900, మహిళలకు రూ.300.
 హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్: 2018, నవంబర్ 22.
 ఫలితాల విడుదల: 2019, జనవరి 10.
 గేట్ స్కోరు ఆధారంగా చేపట్టే సిస్టమ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రారంభం: 2019, ఫిబ్రవరి 5.
 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
 వెబ్‌సైట్: www.univ.tifr.res.in
Published date : 31 Oct 2018 01:27PM

Photo Stories