తెలంగాణలో ఏడు యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పించే పరీక్ష.. సీపీజీఈటీవిధానం ఇదీ!
Sakshi Education
తెలంగాణలో ఏడు యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పించే సీపీజీఈటీ పరీక్ష విధానం, ముఖ్య తేదిల వివరాలు తెలుసుకోండి..
ప్రవేశ పరీక్షను గంటన్నర వ్యవధిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్ ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్ ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్ బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యసమాచారం..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబరు 19, 2020
- దరఖాస్తు ఫీజు: రూ.800, ఎస్సీ,ఎస్టీ,పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.600. -ప్రతి అదనపు సబ్జెక్టుకు దరఖాస్తు ఫీజు రూ.450.
- పరీక్షల నిర్వహణ: అక్టోబరు 31-నవంబరు 9.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.osmania.ac.in
Published date : 30 Sep 2020 05:57PM